సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ గెలుపు

63చూసినవారు
సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ గెలుపు
టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. సూపర్-8లో భాగంగా కింగ్‌స్టన్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 148/6 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాక్స్‌వెల్ (59) ఒక్కడే పోరాడాడు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ 4, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్