TG: పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు చేస్తున్న అరాచకాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరికొందరు టీచర్స్ చేస్తున్న పనికి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, కేజీబీవీ, మోడల్, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల ఫోటోలు ఖచ్చితంగా పెట్టాలని విద్యాశాఖ సంచాలకుడు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈవి నర్సింహారెడ్డి ఆదేశించారు. అయితే పాఠశాలల్లో ఒకరి బదులు మరొకరు బోధనలు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.