ఏపీలోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్తూ శ్రీరాముడు ఇక్కడ స్వయంగా శివ లింగాన్ని ప్రతిష్టించారట. ఈ శివలింగంపై శ్రీరాముడి బొటన వేలు ముద్ర ఉంటుందని పురోహితులు చెబుతున్నారు. శంఖంతో గంగా జలాన్ని శ్రీరాముడు లింగంపై పోయగా.. అప్పటి నుంచి నిత్యం నీరు ఊట వస్తూనే ఉంటుందట. ఇవాళ కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.