షాపుల విషయంలో చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం దుకాణదారులు ఇప్పుడు తమ దుకాణాలను 24 గంటలూ తెరిచి ఉంచుకోవచ్చు. అందుకు ఫీజులు జమ చేయాల్సి ఉంటుంది. అంటే, ఫీజు చెల్లించి అప్రూవల్ తీసుకున్న దుకాణాదారుడు మాత్రమే వారంలో 24 గంటలూ తన దుకాణాన్ని తెరవగలడు. మద్యం దుకాణాలు, బార్ల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.