రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

80చూసినవారు
నార్సింగి మండల కేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి విజృంభణ రైతుల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయకూడదన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విత్తన ప్యాకెట్, బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్