వైభవంగా బీరప్ప ఆలయ వార్షికోత్సవాలు

75చూసినవారు
చిన్నకోడూర్ మండల కేంద్రంలోని బీరప్ప ఆలయ వార్షికోత్సవాలు బీరప్ప కురుమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవాల్లో భాగంగా సోమవారం గోవు లగ్నం, మందమీద సరుగు వేయుట, గావు పట్టుట, అన్నదాన వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాపాపలను చల్లగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్