గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను డ్రా పద్ధతిన ఎంపిక చేసి నెలలు గడుస్తున్నా అధికారులు ఎలాంటి ప్రొసీడింగ్స్ ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వెంటనే అధికారులు ఇళ్లను అప్పగించి, ప్రొసీడింగ్స్ అందజేయాలని డిమాండ్ చేశారు.