గజ్వేల్: నాణేలతో బతుకమ్మ తయారీ.. అక్కకు అంకితం చేసిన రామకోటి

60చూసినవారు
గజ్వేల్: నాణేలతో బతుకమ్మ తయారీ.. అక్కకు అంకితం చేసిన రామకోటి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్తి సమాజం వ్యవస్థాపకులు రామకోటి రామరాజు వినూత్న ఆలోచనతో బుధవారం తన ప్రతిభను చాటారు. గురువారం సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకొని ముందస్తుగా చిన్న 10 పైసల నాణాలతో పెద్ద బతుకమ్మ తయారు చేశారు. ఈ సందర్భంగా తన సోదరి సంధ్యారాణికి పైసల బతుకమ్మను అంకితం చేసినట్లు రామరాజు చెప్పారు. మహిళా సోదరీమణులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్