గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసుల్లో నిందితులకు జైలుశిక్ష విధిస్తూ గజ్వేల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక తీర్పు వెలువరించారని సీఐ సైదా గురువారం తెలిపారు. సింగాటం ఎల్లమ్మ దేవాలయంలో ముక్కుపుడకను దొంగిలించిన కేసులో బోదాసు యాదగిరి, అల్లెపు శేఖర్ పై కేసులో రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, గజ్వేల్లో ద్విచక్ర వాహనం దొంగలించిన కేసులో శంకర్ సింగ్ కు ఆరునెలల జైలు శిక్ష విధించారని తెలిపారు.