ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మ హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మంగళవారం దహనం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఖబర్దార్ అంటూ మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.