గుర్తు తెలియన వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ములుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం మేడ్చల్ కు చెందిన గగనం ప్రేమ్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం కోత్తుర్ లో తన స్నేహితుని కలిసి తిరిగి వస్తుండగా తన బైకును వాహనం వెనుక నుంచి ఢీ కొంది. ప్రేమ అక్కడికక్కడ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.