జాతీయ రహదారిపై గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించండి

51చూసినవారు
జాతీయ రహదారిపై గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించండి
నారాయణఖేడ్ నుండి పుల్కూర్తి వైపు వెళ్లే 161బి జాతీయ రహదారి అధ్వానంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదివారం ఉదయం ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు చిన్నగా ఉండడం రోడ్డుకి ఇరువైపులా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు అధ్వానంగా మారిన సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్