ర్యాలమడుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిరసన
పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీచర్లు డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నారాయణఖేడ్ మండలం ర్యాలమడుగు జడ్పిహెచ్ఎస్, ఎంపిపిఎస్లో టీచర్లు మంగళవారం నిరసన తెలిపారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అంతా కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి విరామ సమయంలో ఆందోళన చేశారు.