రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మనువాడ నుండి మల్లాపూర్ వెళ్లే దారి ఆర్ అండ్ బి రోడ్డు మూలమలుపు మీద చెట్లు భారీగా పెరగటం వలన ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించక పోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించగలరు అని బోయిన్పల్లి మండల బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జనగం లక్ష్మణ్ లోకల్ యాప్ ద్వారా ప్రజా సమస్యలను తెలియజేస్తున్నారు.