చాలా చోట్ల మగవాళ్లు ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో ఇంట్లోని ఆడవాళ్లని కూడా ప్రస్తావిస్తూ అసభ్యకరంగా తిడుతూ ఉంటారు. దీనిని ఆపేందుకు మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా నెవాసా తహసీల్ గ్రామంలో గురువారం జరిగిన గ్రామసభలో గ్రామ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆడవాళ్లను ప్రస్తావిస్తూ దూషిస్తే.. రూ. 500 జరిమానాగా చెల్లించాలని తీర్మానించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఎవరూ కూడా మాట్లాడొద్దని హెచ్చరించారు.