మణిపూర్‌లో పాఠశాలలు, కాలేజీలు శుక్రవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. హింసాత్మక ఘటనలతో ఇంపాల్, జిరిబామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా పాఠశాలలు, కాలేజీలు మూతబడ్డాయి. జిరిబామ్ జిల్లాల్లో తప్పిపోయిన ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళల మృతదేహాలు బయటపడడంతో హింస చెలరేగింది. దీంతో ఆరు జిల్లాల జిల్లా మేజిస్ట్రేట్‌లు నవంబర్ 16 నుంచి కర్ఫ్యూ విధించారు.