వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

75చూసినవారు
వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
AP: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌‌కు సుప్రీంకోర్టు విచారించింది. భాస్కర్ రెడ్డికి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మిగితా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లూ దాఖలయ్యాయని, వాటితో భాస్కర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ కూడా జతచేయాలనని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోరారు.

సంబంధిత పోస్ట్