ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండోకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ప్రధాని భద్రత వలయంలో మహిళా కమాండో ఉన్నారనే విషయం తాజాగా బయటికొచ్చింది. అయితే ఈ ఫొటోపై భద్రతా వర్గాలు స్పందించాయి. ప్రస్తుతం ఎస్పీజీలో 100 మంది మహిళా కమాండోలు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలో కన్పించిన మహిళ మాత్రం ఎస్‌పీజీ టీమ్‌లో భాగం కాదని, ఆమె రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది అని పేర్కొన్నారు.