వెల్గటూర్ మండలంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లేబర్ కార్డ్ కలిగిఉన్న కార్మికులకు న్యాక్ శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, వెల్డింగ్, తాపీ మేస్త్రి లకు 15 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఏ. డీ. అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేబర్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు ఇయొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత హెల్మెట్, బుక్స్, పెన్స్, యూనిఫాం, మరియు మధ్యాహ్న భోజనం కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతుందని చెప్పారు. రోజుకు రూ.300, అలాగే 15 రోజులపాటు మొత్తం రూ.4500 కార్మిక శాఖ ద్వారా వారియొక్క బ్యాంక్ అకౌంట్ లో జమచేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణకు ఆసక్తిగల కార్మికులు తమయొక్క లేబర్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, మరియు 4 నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు న్యాక్ సెంటర్లో సమర్పించి శిక్షణ పొందగలరని తెలిపారు.