జగిత్యాల : సమాజ సేవకులు ఎన్ఆర్ఐ బైర దేవ్ యాదవ్
కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం దాదాపుగా 600 మంది కార్యకర్తలతో కలిసి కలికోట నుండి ర్యాలీగా బయలుదేరి రోడ్ షో నిర్వహించిన అనంతరం స్థానిక ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో వేములవాడ
కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆది శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.