ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్లే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ లో హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని జిల్లా ఎస్పీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ఎస్ఐ లు తిరుపతి, సుదీర్ రావు, ట్రాఫిక్ ఎస్ఐలు రామచంద్ర౦, మల్లేష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.