జగిత్యాల పట్టణంలోని రహ్మత్పుర లోని 29 మరియు 30వ వార్డ్ లలో గత 11 నెలల నుండి మున్సిపల్ నల్ల నీళ్ళు రావటం లేదని సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి వార్డ్ సభ్యులు పిర్యాదు చేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే ఈ నల్ల నీటి సమస్యను పూర్తి చేయాలని సంభందిత అధికారులను ఆదేశించడం జరిగింది. వార్డ్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు బుదవారం నాడు మొదలుపెట్టారు.