శంకరపట్నం మండలం మెట్టుపల్లికి చెందిన ఇట్టవెని సమ్మక్క రామయ్య అనే పాడి రైతు దంపతుల కుమార్తె లావణ్య వివాహం బుధవారం జరగగా కరీంనగర్ పాల డైరీ సొసైటీ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద పుస్తె మట్టెలు పంపిణీ చేశారు. డైరీ సూపర్వైజర్ రెడ్డవేన వెంకటేష్ నూతన వధూవరులకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి సంఘం అధ్యక్షుడు కానుగంటి తిరుపతిరెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.