వంతెన నిర్మించి రోడ్డు వేయడం మరిచారు

70చూసినవారు
వంతెన నిర్మించి రోడ్డు వేయడం మరిచారు
ఏరడపల్లి నుండి కన్నాపూర్ వెళ్లే మార్గమధ్యలో గల వాగుపై కోట్ల రూపాయలతో వంతెన నిర్మించినప్పటికీ ఎరడపల్లి గ్రామం నుండి వంతెన వద్దకు చేరుకునేందుకు రోడ్డు వేయడం మరిచిపోవడంతో ప్రయాణికులు, వ్యవసాయదారులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పడిన ఒక్క వర్షానికే రోడ్డు బురదమై నీటి గుంతలతో ప్రయాణించడానికి ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి వంతెన వద్దకు చేరుకునేందుకు రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.