రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే విజయరమణరావు

69చూసినవారు
రైతు సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే విజయరమణరావు
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి మండలం రాగినేడులో
అప్పన్నపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో సొసైటీ నిధులు రూ. 20 లక్షలతో నిర్మించే గోదాము నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే 8 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విండో ఛైర్మన్ చింతపండు సంపత్, సిఈఓ తిరుపతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్