రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, మందుల పంపిణీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా, మండల స్థాయి అధికారులు ఉన్నారు.