వేములవాడ: వినతులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో కలెక్టర్ అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.