కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట గ్రామానికి చెందిన బత్తిని శ్రీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఆయనకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రూ. 1 లక్ష రూపాయలను బ్యాంక్ లో డిపాజిట్ చేసి బాండ్ పేపర్ ను శ్రీకాంత్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ మాజీ ఛైర్మన్ లోక బాపురెడ్డి ని గ్రామస్తులు అభినందించారు.