ప్రభుత్వ విప్ గా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నియమించడం పట్ల శుక్రవారం కథలాపూర్ మండల
కాంగ్రెస్ నాయకులు కాయితి నాగరాజు, మొహమ్మద్ అజీమ్, తొట్ల అంజయ్య, బైర దేవ్ యాదవ్, వెలిచాల సత్యనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆది శ్రీనివాస్ నియామకం వేములవాడ ప్రజలందరికీ గర్వకారణం అన్నారు.