పర్వకాలం సోమవారం సోమవతి అమావాస్య, అత్యంత విశిష్టమైన రోజని వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు శివ తెలిపారు. సోమావతి అమావాస్య రోజు శివారాధన చెయ్యడం ద్వారా పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయని అర్చకులు, వేద పండితులు చెబుతున్నారు. నేడు గ్రహణంతో కూడా పర్వకాలమని అర్చకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఆరాధించడం కానీ, అభిషేకించడం కానీ చేయాలని కోరుతున్నారు.