యువతిని కిడ్నాప్‌ చేసిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్‌

72చూసినవారు
ప్రభుత్వ షెల్టర్‌ హోమ్‌లో ఉన్న యువతిని ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముసుగులు ధరించిన వ్యక్తులు బాలికల షెల్టర్ హోమ్‌లోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డు గది కిటికీలోంచి కర్ర ద్వారా తాళం చెవి పొంది లోనికి వెళ్లారు. లోపల ఉన్న 17 ఏళ్ల యువతితో పరారయ్యారు. ఆ యువతి ప్రతిఘటించక పోవడంతో వారంతా ఆమెకు తెలిసిన వ్యక్తులుగా తెలుస్తున్నది. కాగా, ఆ సమయంలో సిబ్బంది గాఢ నిద్రలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్