హిందుత్వంపై పవన్ ఆసక్తికర ట్వీట్ (వీడియో)

82చూసినవారు
ఆధ్యాత్మికత, హిందుత్వంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధం దేశ చరిత్ర, సంస్కృతుల్లో కనబడుతూనే ఉన్నాయి. ఆలయాలకు ఖగోళ, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకం. దేవాలయాలు, వాటి గోడలపై తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉంది. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిల్లేవి. దేవాలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి.. అంతరాలను తగ్గించేవి.’ అని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్