స్పెయిన్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ సూరెజ్ మిరమొంటిస్ కన్నుమూశారు. ‘గోల్డెన్ గలిసియన్’గా పేరొందిన ఆయన తన 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అతడి మరణవార్తను కోచ్ ఇంటర్ మిలన్ వెల్లడించింది. అయితే అతడి మరణానికి సంబంధించిన కారణాలను తెలుపలేదు. మిడ్‌ఫీల్డర్‌గా ఓ వెలుగు వెలిగిన లూయిస్ ప్రతిష్టాత్మకమైన బాలన్ డీఓర్ అవార్డు కూడా అందుకున్నాడు.