24న శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

58చూసినవారు
24న శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. 21న ఉదయం 10 గంటలకు ఆర్జితసేవ, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయ‌నున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు విడుదల చేయ‌నున్నారు. వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్