యూపీలోని ప్రయాగారాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. త్రివేణీ సంగమం ఘాట్ వద్ద జరిగిన ఈ ఘటనలో 17 మంది భక్తులు మరణించినట్లు సమాచారం. గాయపడినవారిని సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow us on: https://x.com/LokalAppTelugu