ఏడేళ్ల బాలుడిపై సవతి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. ఏకంగా ఏడు రోజుల పాటు బాత్‌రూమ్‌లో బంధించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చోటుచేసుకుంది. బాలుడిని బాత్‌రూమ్‌లో బంధించి మూడు రోజులు పాటు ఆహారం కూడా ఇవ్వలేదు. అయితే, విషయం తెలుసుకున్న బాలుడి మామ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు బాలుడిని విడిపించారు.