దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 160 పాయింట్లు తగ్గి 78,515 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు తగ్గి 23,798 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, టాటా స్టాల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మెటార్స్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.