దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 310 పాయింట్లు కుంగి 79,969 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 24,259 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.