లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

69చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 సమయానికి సెన్సెక్స్ 309.89 పాయింట్లు పెరిగి 64,673.67 వద్ద, నిఫ్టీ 92.40 పాయింట్లు లాభపడి 19,323 వద్ద ఉన్నాయి. దాదాపు 1784 షేర్లు లాభాల్లో ఉండగా, 411 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా, HUL మాత్రమే నష్టపోయింది.