‘స్త్రీ2’ విజయాన్ని మాటల్లో వర్ణించడం కష్టం: శ్రద్ధాకపూర్

52చూసినవారు
‘స్త్రీ2’ విజయాన్ని మాటల్లో వర్ణించడం కష్టం: శ్రద్ధాకపూర్
'స్త్రీ2' మూవీ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మూవీ విజయం సాధించడంపై తాజాగా హీరోయిన్ శ్రద్ధాకపూర్ స్పందించారు. “ఈవిజయాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. రుచికరమైన భోజనాన్ని తినడం, కుటుంబంతో కలిసి ఆనంద క్షణాల్ని ఆస్వాదించడం, మనసుకు నచ్చినవారు పక్కన ఉండడం, ప్రశాంతంగా నిద్ర పోవడం ఇవన్నీ నా దృష్టిలో నిజమైన విజయాలే. కెరీర్ లో గెలుపోటములు ఎన్ని వచ్చినా స్థిరంగా ఉండాలని మా నాన్నను చూసి తెలుసుకున్నా' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్