బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 9 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా.. వ్యోమనౌకలోని థ్రస్టర్లలో
సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.