అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8.15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. 10.15 గంటలకు అన్‌డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఆ త్వరాత క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. దీంతో వారి ప్రయాణం భూమ్మీదకి ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది.