TG: తనకు వేరేమార్గం లేక బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు యూట్యూబర్ సన్నీ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై విసి సజ్జనార్ తనదైన శైలిలో స్పందించారు. ‘చూశారా.. వీళ్లు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్‌కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా’ అని సజ్జనార్ కామెంట్ చేశారు.