బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా యూట్యూబర్ అన్వేష్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అన్వేష్‌తో IPS సజ్జనార్ చిట్ చాట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తన తండ్రి కూడా బెట్టింగ్ బాధితుడేనని చెప్పారు. డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌కు యువత బలైపోతోందని చెప్పారు. ఇప్పటికే అనేకమందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.