ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో బిగ్‌బాస్ టైటిల్ విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పల్లవి ప్రశాంత్ ఓ క్రికెట్ ప్రెడిక్షన్స్ యాప్‌ని బాగా ప్రమోట్ చేస్తూ వీడియోలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు అందుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అన్వేష్ బయట పెట్టాడు. దీంతో రైతు బిడ్డపై కూడా కేసు నమోదుకానున్నట్లు తెలుస్తోంది.