తెలంగాణలో మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ విషయాన్ని సెబీకి లేఖ ద్వారా తెలిపింది.