ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆప్ ప్రభుత్వంపై మండిపడింది. గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువ పెరిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. స్టేజ్-4 ఆంక్షల అమలులో ఆలస్యంపై నిలదీసింది. జీఆర్‌ఏపీ అమలులో జాప్యం చేయడంపై ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర కమిషన్ (ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్)ను సుప్రీం తీవ్రంగా మందలించింది.