భారత్ బందులో పాల్గొన్న మాల మహానాడు నాయకులు
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆత్మకూరు ఎస్ మండలం నేమ్మికల్ గ్రామంలో బుధవారం స్థానిక మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ తీర్పును వెనకకు తీసుకోకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తామని హెచ్చరించారు.