వికలాంగుల పునరావాసాలకు, పెన్షన్ పెంపునకు నిధులు కేటాయించక పోవడం పై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో సోమవారం బడ్జెట్ సవరించి 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం 615. 33కోట్లు కేటాయించారన్నారు.