మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. కన్నతండ్రిని హత్య చేసిన కొడుకు

50చూసినవారు
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. కన్నతండ్రిని హత్య చేసిన కొడుకు
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజాపూర్ మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన కావలి నారాయణ అనే వ్యక్తికి నందు అనే మతి స్థిమితం లేని కొడుకు ఉన్నాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్నాక నందు తన తండ్రిని గొడ్డలితో హత్యచేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్